Srinivas Rao Thotakura

33 Flips | 1 Magazine | 9 Followers | @srinivasrao71ft | Keep up with Srinivas Rao Thotakura on Flipboard, a place to see the stories, photos, and updates that matter to you. Flipboard creates a personalized magazine full of everything, from world news to life’s great moments. Download Flipboard for free and search for “Srinivas Rao Thotakura”

శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ శ్రీరామభక్త! కపిపుంగవ! దీనబంధో! సుగ్రీవ మిత్ర! దనుజాంతక! వాయుసూనో! లోకైక వీర! పురపాల! గదాప్తపాణే! వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్ ఉత్తిష్ట దేవ! శరణాగత రక్షణార్ధం దుష్టగ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్ దూరీకురుష్వ భువి సర్వభయం సదామే వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్ ఇతి శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ సంపూర్ణమ్

శ్రీ మారుతీ స్తోత్రమ్ ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే మోహ శోక వినాశాయ సీతాశోక వినాశినే భగ్నాశోకవనాయస్తు దగ్థలంకాయవాజ్నినో గతినిర్జితవాతాయ లక్ష్మణ ప్రాణ దయచ వనోంకసాం వరిష్టాయ వశినే వనవాసినే తత్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయనే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ జన్మ మృత్యుభయఘ్నాయ సర్వక్లేశ హరాయచ నేదిష్టాయ ప్రేత భూత పిశాచ భయహరిణే యాతనా నాశనాయస్తు నమో మర్కటరూపిణే యక్ష రాక్షస శార్దూల సర్పవృచ్చిక భీహృతే మహాబలాయ వీరాయ చిరంజీవి నహీద్ద్రతే హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్ధయే బలినామగ్రగణ్యాయ నమోనమళః పాహిమారుతే లాభదోసిత్వమేలాశు హనుమాన్ రాక్షసాంతక యశో జయంచమేదేహి శతృన్ నాశాయనాశయ స్వాశ్రితానామ భయదం యఏవంస్తోతిమారుతిం హావికుతోభవేత్తస్య సర్వత్రవిజయీ భవేత్!! స్వాశ్రితానామ భయదం యఏవంస్తోతిమారుతిం హావికుతోభవేత్తస్య సర్వత్రవిజయీ భవేత్!!

శ్రీ ఆంజనేయ దండకమ్ శ్రీ ఆంజనేయం – ప్రసన్నాంజనేయం – ప్రభాదివ్యకాయం – ప్రకీర్తిప్రదాయం – భజేవాయుపుత్రం – భజేవాలగాత్రం – భజేహం పవిత్రం – భజేసూర్యమిత్రం – భజేరుద్రరూపం – భజే బ్రహ్మతేజంబటంచున్ – ప్రభాతంబు సాయంత్రంబు – నీనామ సంకీర్తనల్ జేసి – నీరూపు వర్ణించి – నీమీద నేదండకం బొక్కటిన్ – జేయనూహించి – నీమూర్తినిన్ గాంచి – నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై – శ్రీరామ భక్తుండనై – నిన్ను నేగొల్చెదన్ – నీకటాక్షంబునన్ జూచితే – వేడుకల్ జేసితే – నా మొరాలించితే – నన్ను రక్షించితే- దగ్గరన్నిల్చితే – తొల్లి సుగ్రీవుకు న్మంత్రివై స్వామికార్యార్ధమం దుండి – శ్రీరామసౌమిత్రులంజూచి – వారిన్ విచారించి – సర్వేశు పూజించి – యబ్బానుజుల బంటుగావించి – యవ్వాలినింజంపి – కాకుత్థ్సతిలకున్ – దయాదృష్టి వీక్షించి – కిష్కింధకేతెంచి – శ్రీరాముకార్యార్ధమై – లంకకేతెంచియున్ – లంకిణింజంపియున్ – లంకయున్గాల్చియున్ – భూమిజన్ జూచి – యానందముప్పొంగ – నా యుంగరంబిచ్చి – యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి – సంతోషితున్ జేసి – సుగ్రీవుడా యంగదా జాంబవంతాది – వీరాదులం గూడి – యాసేతువున్ దాటి – వానరుల్ మూక పెన్మూకలై – దైత్యులన్ ద్రుంచగా – రావణుండంత – కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి – యాశక్తియున్ వేసి – యాలక్ష్మణున్ మూర్చనొందించగా – నప్పుడేబోయి సంజీవియున్ దెచ్చి – సౌమిత్రికిన్నిచ్చి – ప్రాణంబురక్షించగా – కుంభకర్ణాది న్వీరులన్ బోరి – శ్రీరాము బాణాగ్ని వారందరున్ – రావణున్ జంపగా- నంతలోకంబులానందమైయుండ – నవ్వేళలందు – న్విభీషణన్ – వేడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతామహాదేవినిన్ దెచ్చి – శ్రీరాముతో జేర్చి – యయోధ్యక్షున్ వచ్చి – పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న – నాకేవ్వరున్ కూర్మిలేరంచు – మన్నించినన్ – శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను – నీనామ సంకీర్తనల్ జేసితే – పాపముల్ బాయునే – భయములు నీర్దునే – భాగ్యముల్ గల్గునే – సకల సామ్రాజ్యముల్ – సకల సంపత్కారమ్ముల్ధగం గల్గవే వానరాకార – యోభక్తమందార – యోపుణ్యసంచార – యోధీర – యోవీర – నీవేసమస్తంబు – నీవేమహాఫలముగా వెలసి – యా తారకబ్రహ్మమంత్రంబు – పఠియించుచున్ సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి – శ్రీరామ శ్రీరామ యంచున్ – మనఃపూతమై – ఎప్పుడున్ తప్పకన్ దలతు – నాజిహ్వాయందుండియుం నీదీర్ఘదేహంబు – త్రైలోకసంచారివై – రామనామాంకితధ్యానివై – బ్రహ్మవై – బ్రహ్మతేజంబునన్ – రౌద్రనిజ్వాల కల్లోల – హావీర హనుమంత – ఓంకార ఓంకార శబ్దంబులన్ – క్రూరసర్వగ్రహ భూతప్రేతపిశాచ – శాకినీడాకీనీ – మోహినీ గాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి - నేలం బడంగొట్టి – నీ ముష్టిఘాతంబులన్ – బహుదండంబులన్ – రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై – బ్రహ్మప్రభాభాపితంబైవ – నీదివ్య తేజంబునన్ జూపి రార నాముద్దు కుమారా యంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే, సదా బ్రహ్మచారీ నమస్తే, వ్రతపూర్ణహారీ నమస్తే వాయుపుత్రా నమస్తే నమోనమః నీదివ్యక్షేత్రంబునైమొప్పు శ్రీతాడుబందుపురంబందు – (ఇచటతాము పూజించు హనుమాన్ నామమును ఉచ్చరించుకోవచ్చును) నీనోర్మిదర్శించి హర్షించు – నీభక్తబృందంబులన్ జేరి – దయాదృష్టివీక్షించి – ఎల్లప్పుడున్ దీవించు స్వామి నమస్తే నమస్తే – నమస్తే వ్రతః పూర్ణకారీ నమస్తే – శ్రీమద్విరాంజనేయానమస్తే – నమస్తే నమః!! (ఈ దండకాన్ని నిష్టతో పఠించినట్లయితే, సర్వపాపాలూ నశిస్తాయి. బాధలు, భయాలు, అనారోగ్యాలూ ఉండవు. భోగభాగ్యాలు వరిస్తాయి. సకల సంపదలూ కల్గుతాయి. భూతప్రేత పిశాచ రోగ శాకినీ డాకీనీ గాలిదయ్యంబులు దరికి చేరవు)

ఆంజనేయ స్తుతి గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసమ్ రామాయణ మహామాలా- రత్నం వందే నిలాత్మజమ్ అజ్ఞానానన్దనం వీరం జానకీ శోకనాశనమ్ కపీశ మక్షహన్తారం వందే లంకాదగ్ధం ఉల్లంఘ్య సిన్దో స్సలిలం సలీలం యస్శోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లజ్కాం నమామి తం ప్రాజ్ఞాలి రాజ్ఞనేయమ్. ఆంజనేయ మతి పాటలాననం కాజ్ఞనాద్రి కమనీయ విగ్రహమ్ పారిజాతతరుమూలవాసినం భావయామి పవనామ నర్దనమ్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాజ్ఞలిం భాష్సవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రాక్షసాస్తకమ్ మనోజవం మారుతతుల్యవేగం జితేన్ద్రియం బుద్దిమతాం పరిష్టమ్ వాతాత్మజం వానరాయుథముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి

సృష్టికర్త బ్రహ్మదేవుని అర్థాంగి అయిన సరస్వతీ దేవి ఆయన్ను సుసంపన్నం చేస్తుంది. సరస్వతీ దేవి నాలుగు చేతులు నాలుగు దిక్కులకు సంకేతం. ఆ అమ్మ శ్వేతవర్ణం బ్రహ్మ తేజస్సును ప్రతిఫలిస్తుంది. సరస్వతీ దేవి నాలుగు చేతుల్లో ధరించిన - 1) పుస్తకం : విజ్ఞానసర్వస్వం లాంటి వేదాలు 2) జపమాల : అక్షరజ్ఞానాన్ని అందిస్తూ శ్రద్ధాసక్తులను పెంచడానికి తోడ్పడుతుంది. 3) వీణ : కళలకు సంకేతం. అంతేకాదు, అతీంద్రియ శక్తులను అందించి మోక్షానికి దారితీస్తుంది. 4) కమలం : సృష్టికి సంకేతం సరస్వతీ దేవి ధరించే తెల్లని చీర : స్వచ్ఛతకు నిదర్శనం సరస్వతీ దేవి అధిరోహించిన శ్వేత హంస : ఆత్మలన్నిటికీ మూలమైన పరమాత్మను సూచిస్తుంది. సరస్వతీ దేవి పుట్టింది కూడా చల్లటి కాలంలో. చల్లదనం కారుణ్యానికి సంకేతం. ఒక్క మాటలో చెప్పాలంటే సరస్వతీ దేవి అపరిమితమైన స్వచ్చతకు, అపార జ్ఞానాకికి, కళలకు, సృజనాత్మకతకు, మోక్షసిద్ధికి కారకం, సూచకం. ఓం సరస్వతీ మహాభాగ్యే విద్యే కమలలోచనే విశ్వరూపే విశాలాక్షీ, విద్యాం దేహి నమోస్తుతే జయజయ దేవి చరాచరశరీ కుచయుగ శోభిత ముక్తహారే వినా రంజిత పుస్తక హస్తే భగవతి భారతి దేవి నమోస్తుతే.

శ్రీ ప౦చమి (ఫిబ్రవరి 4, 2014, మంగళవారం) మాఘశుధ్ధ ప౦చమిని సరస్వతీ జయ౦తిగా ఆరాధి౦చడ౦ అనేది పురాణాలలోనూ, ఇతర శాస్త్రాలలోనూ కనపడుతున్నటువ౦టి అ౦శ౦. దీనికే వస౦త ప౦చమి అనే వ్యవహార౦ ఉన్నది. దీనినే శ్రీప౦చమి అని కూడా అ౦టారు. ఈరోజు సరస్వతీ దేవి ఆవిర్భావ దిన౦గా దేవీభాగవత౦, బ్రహ్మవైవర్త పురాణ౦ కూడా ప్రస్తావిస్తున్న అ౦శ౦. పరమపురుషునియొక్క వదన౦ ను౦చి సరస్వతీ దేవి ఆవిర్భవి౦చి౦ది అని కథ. జగతి అ౦తటికీ కారణమైన పరమేశ్వరుడు విరాట్ పురుషుడు. ఆయనయొక్క వాక్కు, బుధ్ధి, జ్ణానముల స్వరూపమే సరస్వతి. వాక్బుధ్ధి జ్నానాధిష్టాత్రి. మనకు ఒక పని చేయటానికి వాక్కు, బుధ్ధి, జ్నాన౦ ఎలా కావాలో సృష్టి, స్ఠితి లయలు చేయడానికి పరమేశ్వరునికి కూడా వాక్కు, బుధ్ధి, జ్ణానము ఉ౦ది. ఆయనకున్న ఈశక్తిని మన౦ సరస్వతిగా ఉపాసిస్తున్నాము. ఆ సరస్వతి ఈ ప౦చమినాడు విరాట్ పురుషుని ను౦చి ఆవిర్భవి౦చి౦ది. ఈరోజు సరస్వతీ ఆరాధన అత్య౦త ప్రశస్తిగా ఉన్నది. కేవల౦ భూలోక మానవులు మాత్తమే కాకు౦డా దేవలోక౦లో కూడా సరస్వతిని ఆరాధిస్తారు అని దేవీభాగవత౦ చెప్తో౦ది. సరస్వతీ ఉపాసనకి చాలా మ౦త్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జ్నానవృధ్ధికి చెప్పబడినవి అయితే కొన్నిఐశ్వర్య సిధ్ధికి చెప్పబడినాయి. బీజాక్షరాలు మాత్ర౦ సరియైన గురువు ద్వారా సరియైన పధ్ధతిలో ఉపదేశ౦ పొ౦ది చేయాలి తప్ప పుస్తకాలు చూసో, టివీలో చూసో చేయరాదు. ముఖ్య౦గా సరస్వతి ప్రతి నామమూ ఒక మ౦త్రమే. "శ్రీ సరస్వత్యై నమ:" అనే ఈ మ౦త్ర౦ గొప్ప మ౦త్ర౦. ఈ శ్రీకార౦లోనే చైతన్య౦ అ౦తా ఉ౦ది. అ౦తేకాక ఈ ’శ్రీ’ ముగ్గురు అమ్మలకూ వర్తిస్తు౦ది. ఇది కాకు౦డా దేవీభాగవత౦లో ప్రార౦భ౦లోనే 24 అక్షరాలు, 3 పాదముల ఒక మహామ౦త్ర౦ ఉన్నది. ఒక్కొక్క పాదానికి 8అక్షరాల చొప్పున ఉ౦టు౦ది. ఇది గాయత్రీ మ౦త్ర౦తో సమానమైనది. బుధ్ధిశక్తిని పె౦చుతు౦ది. సరియైన నిర్ణయాన్ని, ఆలోచనని ఇచ్చి అది సాఫల్య౦ అయ్యేట్లుగా చేస్తు౦ది. అలా౦టి మహామ౦త్ర౦ వ్యాసదేవుడు మనకు ఇచ్చారు. అ౦దరూ పఠి౦చవచ్చు. "సర్వ చైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్" అమ్మవారు సర్వచైతన్య స్వరూపిణి. విశ్వానికి ము౦దే ఉ౦ది కనుక ఆద్య, జ్నాన రూపిణి కనుక విద్య, అటువ౦టి సరస్వతిని ధ్యానిస్తున్నాను. ఆ సరస్వతీ దేవి మాయొక్క బుధ్ధులను ప్రేరేపి౦చే తల్లి. దీనికి గురూపదేశాలు అవసర౦లేదు. అమ్మవారు మనకి ఉపడేశి౦చారు అని భావి౦చి పఠిస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తు౦ది. గాయత్రి, సావిత్రి సరస్వతి అనేది వేదమాతయొక్క నామ౦గా వేద౦ తెలుపుతో౦ది. ఈవేదమాత ప్రాత:కాల౦లో గాయత్రిగానూ, మధ్యాహ్న కాల౦లో సావిత్రిగానూ, సాయ౦స౦ధ్యాకాల౦లో సరస్వతిగానూ ఉపాసి౦పబడుతు౦ది. మూడు పేర్లు ఉన్నప్పటికీ శక్తి మాత్ర౦ ఒక్కటే. ఆ శక్తి స౦ధ్యాశక్తి, ప్రాణ శక్తి, జ్నాన శక్తి. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అనగా ప్రాణములను రక్షి౦చేటువ౦టి శక్తి. సావిత్రి అ౦టే సృష్టి కారక శక్తి. సరస్వతి అ౦టే ప్రవాహశీలిని అయిన శక్తి. జ్నాన౦ ప్రవాహరూప౦లో ఉ౦టు౦ది. శక్తియొక్క లక్షణమే ప్రవాహ౦. ఈ అన౦త విశ్వ౦లో నిర౦తర౦ ప్రసరిస్తూ ఉన్నదో ఆ ప్రాణశక్తే సరస్వతి. ప్రప౦చ౦లోని ప్రాణాలను కాపాడుతో౦ది కనుక గాయత్రి. సృష్టికికారణ౦ కనుక సావిత్రిగా పిలువబడుతో౦ది. అమ్మవారి నవరాత్రులు ముఖ్య౦గా రె౦డు వస్తాయి. ఒకటి వస౦త నవరాత్రులు, రె౦డవది శరన్నవరాత్ర్లులు. శ్రీవిద్యా శాస్త్ర పర౦గా స౦వత్సర౦లో ఇ౦కో రె౦డు నవరాత్రులు ఉన్నాయి అని తెలుస్తో౦ది. ఇచ్ఛాశక్తి లలితా, జ్నానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. వారాహి నవరాత్రులు ఆషాఢ మాస౦లో శుక్లపాడ్యమి ను౦చి నవమి వరకు చేస్తారు. మాఘశుధ్ధ పాడ్యమి ను౦చి తొమ్మిదిరోజుల పాటు చేసే నవరాత్రులను శ్యామలా నవరాత్రులు అ౦టారు. ఈమధ్యలో వచ్చే ప౦చమినే మన౦ సరస్వతీ ఆరాధనకు చెప్పుకు౦టున్నా౦. సరస్వతి హ౦స వాహన౦పై, మయూర వాహన౦పై కూర్చున్నట్లు కనిపిస్తు౦ది. జ్నాన ప్రధాన దేవతలను మయూర వాహన౦గా ఆరాధిస్తారు అని తెలుస్తున్నది. హ౦స శబ్ద శక్తికి, ప్రాణ శక్తికి స౦కేత౦. నెమలి యజ్నశక్తికి స౦కేత౦. యోగశాస్త్ర౦లో శ్వాసకు హ౦స అనే పేరు ఉన్నది. ఊపిరులను హ౦సలు అ౦టారు. ఉచ్ఛ్వాస నిశ్వాస అనే రె౦డు రెక్కలతో కూడిన ప్రాణశక్తిని హ౦స అ౦టారు. ఊపిరి మనకి మూలాధార చక్ర౦ను౦చి కదిలివచ్చి శబ్దరూప౦లో వెలికి వస్తు౦ది. ఆప్రాణశక్తి వాయురూప౦గా శబ్ద రూప౦గా వెలికి వచ్చేటప్పుడు పర పశ్య౦తి మధ్యమా వైఖరి అనే నాలుగు రూపాలతో వస్తు౦ది. ఆ ప్రాణశక్తిని అధివసి౦చి ఉ౦టు౦ది శబ్దశక్తి. అ౦దుకే శబ్దశక్తి సరస్వతి. ప్రాణశక్తి హ౦స. హ౦స విచక్షణకు స౦కేత౦గా భావిస్తు౦ది మన స౦స్కృతి. పాలు, నీళ్ళు కలిపి పెడితే పాలను మాత్రమే స్వీకరి౦చి నీటిని విడిచిపెడుతు౦ది హ౦స. అలాగే మనకు విద్య వల్ల కలుగవలసి౦ది వివేక౦. వివేక౦ అ౦టే చెడును విడిచి మ౦చిని స్వీకరి౦చి ఆమ౦చిని మనలో పె౦చుకొని పె౦పొ౦ది౦చాలి. విచక్షణ అనేది చాలా ప్రధాన౦. విచక్షణ మీద విద్య ఆధారపడి ఉ౦టు౦ది. నెమలి చిత్రాగ్ని. "చినోతి అనేక వర్ణా:ఇతి చిత్ర౦" అనేక ర౦గులతో కూడియున్న కా౦తి శక్తి అగ్ని స్వరూప౦. ఇది ఒక స౦వత్సర౦లో మారుతున్న ఋతువులకు స౦కేత౦. అ౦దుకే ఇది కాలాగ్ని, యజ్నాగ్ని. మయూరవాహన౦పై ఉన్న అమ్మవారు యజ్న ఫలప్రదాయిని. యజ్న స్వరూపిణి. వేదములు రె౦డుభాగములు. కర్మకా౦డ, జ్నానకా౦డ. కర్మకా౦డ యజ్నమయ౦. జ్నానకా౦డ జ్నానమయ౦. జ్నానమ౦దు ఆమె తత్త్వ స్వరూపిణిగా ఉ౦టు౦ది. యజ్నమున౦దు కర్మఫల ప్రదాయినిగా ఉ౦టు౦ది. ఏ దేవతానుగ్రహ౦ కావాలన్నా ఉ౦డవలసి౦ది నిష్కపటమైన భక్తి. ఎవరు ఏ మేరకు ఆరాధనా చేస్తే వారిని ఆ మేరకు అమ్మవారు తప్పక అనుగ్రహిస్తు౦ది. కర్మ శ్రధ్ధతో కూడుకున్నప్పుడు సత్ఫలితాన్ని ఇస్తు౦ది. శ్రధ్ధ అ౦టే శాస్త్ర వాక్యములపై విశ్వాస౦. అకు౦ఠితమైన విశ్వాస౦తో, భక్తితో సేవిస్తే తప్పక అనుగ్రహిస్తు౦ది. సరస్వతీ ఆరాధకులు సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉ౦డాలి. సరస్వతి తత్త్వమే శుధ్ధ సత్త్వ గుణ౦. శుధ్ధ సత్త్వము అ౦టే రజోగుణ, తమోగుణ దోషాలు లేనటువ౦టిది. సాత్విక గుణాలైనటువ౦టి సత్యము, శౌచము, అహి౦స వ౦టి పవిత్రమైన పధ్ధతులు పాటిస్తూ వాక్కును నిగ్రహి౦చుకోవాలి. వాచక రూప తపస్సు సరస్వతీ ఆరాధనకు చాలా అవసర౦. "అనుద్వేగ కర౦ వాక్య౦ సత్య౦ ప్రియ హిత౦ చ యత్ స్వాధ్యాయాభ్యసన౦ చైవ వాజ్మయ౦ తప ఉచ్ఛతే" మాట్లాడే మాట ఎదుటివారిని ఆ౦దోళనకు, ఉద్రేకానికి గురిచేయరాదు. ప్రియ౦గా, హిత౦గా, సత్య౦గా, మిత౦గా మాట్లాడాలి. పెద్దలు రచి౦చిన ఉత్తమ గ్ర౦ధాలను పఠి౦చాలి. దివ్యమైన శబ్దములు మన నోటితో పలకాలి. తామసిక పదార్ధాలను విసర్జి౦చాలి. అలా చేస్తూ "సర్వ చైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్" మ౦త్రాన్ని జపి౦చితే శీఘ్రమైన ఫల౦ తప్పకు౦డా కలుగుతు౦ది.

ఫిబ్రవరి 4, 2014, మంగళవారం శ్రీ విజయనామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు. మాసము : మాఘము, పక్షము : శుక్లపక్షం, వారం : మంగళవారం తిథి : పంచమి 1:02 pm నక్షత్రము : రేవతి 4:31 am+ యోగము : సిద్ధ 8:39 am, సాధ్య 6:40 am+ కరణము : భాలవ 1:02 pm, కౌలవ 12:32 am+ సూర్యరాశి : మకరము, చంద్రరాశి : మీనము సూర్యోదయము : 6:47 am, సూర్యాస్తమయము : 6:09 pm, చంద్రోదయం : 9:57 am రాహుకాలము : 3:20 pm-4:50 pm వర్జ్యం : 4:37 pm-6:13 pm దుర్ముహూర్తము : 9:08 am-9:52 am, 11:10 pm-12:04 am+ యమగండము : 9:43 am-11:08 am అమృతకాలము : 2:05 am+-3:39 am+

Log In or Sign Up to View

This Facebook post is no longer available. It may have been removed or the privacy settings of the post may have changed.

Brahmasri Chaganti Koteswara Rao Garu.

గర్భోపనిషత్తు :<p>ఋతుకాలమున సంయోగనంతరము ఒక్కరాత్రియుండెనేని (శుక్ల శోణిత పదార్థము) ముద్ద అగుచున్నది. ఏడురోజులు ఉండినచో బుగ్గ అగుచున్నది. పదునైదు …

Brahmasri Chaganti Koteswara Rao Garu.

హంసోపనిషత్తు<p>‘హంస హంస’ అని పరమహంస స్వరూపమును (భాగవత్స్వరూపమును) సదా ధ్యానించునట్టియు, ఇంద్రియ నిగ్రహము గలిగినట్టియు, గురుభక్తుడును అగు బ్రహ్మనిష్టునకు …