Madhavarao Lakkaniki

300 Flips | 3 Magazines | 20 Likes | 3 Following | 1 Follower | @lvsmadhav | Keep up with Madhavarao Lakkaniki on Flipboard, a place to see the stories, photos, and updates that matter to you. Flipboard creates a personalized magazine full of everything, from world news to life’s great moments. Download Flipboard for free and search for “Madhavarao Lakkaniki”

తిరుప్పావై 30వ రోజు పాశురము వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై తింగళ్ తిరుముగత్తు శేయిరైయార్ శెన్ఱిఱైంజి అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న శంగ త్తమిర్ మాలై ముప్పదుం తప్పామే ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్ శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్ ఎంగుం తిరువగుళ్ పెత్తిన్భుఱువర్ ఎంబావాయ్ తిరుప్పావై ముప్పైవ రోజు సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండగ. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా, ఈ కాలం మనకు పంటలతో ఒక నిండు తనాన్ని కల్గించే కాలంగా మనం అనుభవిస్తుంటాం. నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంది. తత్ ఫలితంగా శ్రీవెల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పొందిన రోజుని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. తరువాత రోజు కనుమ. ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండగ. దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయ్యినట్లుగనే దేవతలకు ఉత్తరాయణం ప్రవృత్తి ఇక దక్షిణాయణం నివృత్తి. దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి, దక్షిణాయనంలో అసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మ ముహూర్తం ఎట్లా అయితే తెల తెల వారే సమయంలో ఉంటుందో, ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది, ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాశురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారుచేసుకుంటాం, తద్వార చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టు ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట, క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది "సంక్రాంతి" అయ్యింది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా, ధనుఃరాశి నుండి మకరరాశికి మారుతాడు కనుక కొందరు ఈ రోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ, తమ బంధువులను, అల్లుల్లను ఇంటికి రప్పించుకొని వివిద సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణుచిత్తులవారికి ఆల్లుడైయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి, కనుమ నాడు గోదాదేవితో కలిసి శ్రీవెల్లిపుత్తూర్ చేరి ఆరాధన అందుకున్నాడు. ఇవన్నీ భావించి మన పూర్వులు మనకొక పండగను అందించారు. ఈ పండగలో గొబ్బిల్లను పూజిస్తారు, గొబ్బిల్లు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పినదాన్ని పాటించాలి అని కోరుకుంటారు. ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో, మనం కూడా భగవత్ ప్రవృత్తి కల్గి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండగను ఏర్పాటు చేసి ఇచ్చారు. మనం ఆచరించే ప్రతి పండుగ పైపైకి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా, దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేశం మన ప్రతీ పండగలో కనిపిస్తుంది. ప్రతి పండగలో మూడు విషయాలు సూచిస్తారు. 1. ఆధ్యాత్మిక ఉన్నతి 2. శారీరక ఆనందం 3. మన దోషాలు తొలగటం మామూలుగా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నం మాని నివృత్తి చేయలేం, అందుకే పంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. అవి మనం దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటకాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి పంచ మహాయజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు. వివిద ధానధర్మాలు చేతనైనంతవరకు చేస్తారు. బసవన్నలను సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుల్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇవ్వుగాక. ఈ రోజు పాశురం ఈ దివ్య ప్రభందాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం. ఇక ఫలశృతిని తెలుపుతుంది ఈ పాశురం. ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేని పట్ల చివరి రెండు అయినా తప్పని సరి అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పొందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది. "వంగ క్కడల్" అలలతో కూడిన ఆ పాలసముద్రాన్ని "కడైంద" చిలికినప్పుడు "మాదవనై" ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు. ఆయనే "క్కేశవనై" కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు. దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకీ అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం, ఇటు దేవతలకు అటు అసురలకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనిదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్షనం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. ఆలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ "మాదవనై" అంటూ రహస్యం చెబుతుంది. "శేయిరైయార్" భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల "శెన్ఱిఱైంజి" ఆ గోపికలు "అంగ ప్పఱై కొండవాత్తై" చంద్రుడివలె ప్రకాశించే "తింగళ్ తిరుముగత్తు" ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు. "అణి పుదువై" భూమికి అలంకారమైన శ్రీవెల్లిపుత్తూర్ లో "ప్పైంగమల త్తణ్ తెరియల్" చల్లటి తులసి మాలను ధరించి ఉన్న "పట్టర్బిరాన్" విష్ణుచిత్తుల వారి కూతురైన "కోదై" గోదాదేవి "శొన్న" చెప్పిన "శంగ త్తమిర్ మాలై" తీపైన ఈ పాటల మాలయైన "ముప్పదుం తప్పామే" ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. మరియూ ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి, ప్రతి మెట్టూ అవసరం. "శెంగణ్ తిరుముగత్తు" వాత్సల్యమైన ఆ ముఖంతో "చ్చెల్వ త్తిరుమాలాల్" ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు, "ఇంగిప్పరిశురైప్పర్" ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి. "ఈరిరండు మాల్ వరైత్తోళ్" రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. "ఎంగుం తిరువగుళ్ పెత్త్" అన్ని చోట్లా దివ్య అనుగ్రహాన్ని పొంది "ఇన్బుఱువర్" ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు.

పరాపర విద్యలకు అధిష్ఠాత్రి సరస్వతి. ఆమె అనుగ్రహంవలన ఉలుకూ, పలుకూ, బుద్ధి, శక్తి లభిస్తాయి. మతిమరుపు, మాంద్యం తొలగుతాయి. మేథాశక్తి పెంపొంది, సరియైన జ్ఞానం కలిగి ఇహమూ, పరమూ, మోక్షమూ లభిస్తాయి. జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి. అందుకే ‘‘నిశే్శష జాడ్జాపహా’’ అన్నారు. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. ‘అమ్మలగన్నయమ్మ’ ఆమె. నదులలో గొప్పది. దేవతలలో శ్రేష్టురాలు. అందుచేతనే ‘‘యాబ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిః దైవైః’’ సదా పూజలనందుకుంటున్నది. శ్రీ శంకర భగవత్పాదులు శారదాదేవి కృపచేతనే అపారమైన వేద వేద వాఙ్మయాన్ని పొంది, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను పునఃప్రతిష్ఠించినట్లు విజ్ఞులు చెబుతారు. శారదామాత పట్ల తన శరణాగతికి ప్రతీకగా శృంగేరీ క్షేత్రంలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు. మనందరికీ మార్గనిర్దేశం చేసేరు.

MAAGHA PURANAM -- 6 మాఘపురాణం - 6వ అధ్యాయం సుశీల చరిత్ర భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరిణె వంటి ఒక కుమార్తె గలడు. ఆ కన్యపేరు సుశీల. మంచి శీలం గలది. మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచూ, యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై యుండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగ శృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన అ అముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కూ గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయి వున్నారు. ఆ వార్త మృగ శృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములనూ చూశాడు. ఎక్కడలేని దుఃఖమూ కలిగింది. వారినెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్మువరకు దిగి ధ్యానం చేయసాగెను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగ శృంగుని వద్దకు వచ్చినది. ఐననూ మృగ శృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే వున్నాడు. ఏనుగు కూడా మృగ శృంగుని కెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకొన్నది. ఐననూ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాపవిమోచనం కలిగించిన ఆ మృగ శృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా! మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాపవిమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో! మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు.

MAAGHA PURANAM -- 6 మాఘపురాణం - 6వ అధ్యాయం సుశీల చరిత్ర భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరిణె వంటి ఒక కుమార్తె గలడు. ఆ కన్యపేరు సుశీల. మంచి శీలం గలది. మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచూ, యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై యుండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగ శృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన అ అముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కూ గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయి వున్నారు. ఆ వార్త మృగ శృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములనూ చూశాడు. ఎక్కడలేని దుఃఖమూ కలిగింది. వారినెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్మువరకు దిగి ధ్యానం చేయసాగెను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగ శృంగుని వద్దకు వచ్చినది. ఐననూ మృగ శృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే వున్నాడు. ఏనుగు కూడా మృగ శృంగుని కెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకొన్నది. ఐననూ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాపవిమోచనం కలిగించిన ఆ మృగ శృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా! మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాపవిమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో! మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు.

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 జనవరి 23, 2018 మంగళవారం (భౌమ్యవాసరే) శ్రీ హేమలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘ్ మాసం శుక్ల పక్షం తిధి : షష్ఠి మ12.38 తదుపరి సప్తమి నక్షత్రం : రేవతి తె4.52 యోగం :శివంఉ7.22vతదుపరి సిద్ధం తె5.31 కరణం : గరజి రా12.15 సూర్యరాశి :మకరం చంద్రరాశి : మీనం సూర్యోదయం : 6.39 సూర్యాస్తమయం : 5.44 రాహుకాలం:మ3.00-4.30 యమగండం :ఉ9.00-10.30 వర్జ్యం : సా4.52 - 6.28 దుర్ముహూర్తం: ఉ9.01-9.46 & రా11.09 - 12.00 అమృతకాలం:రా1.28-4.04 శుభమస్తు🙏🏻

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 జనవరి 23, 2018 మంగళవారం (భౌమ్యవాసరే) శ్రీ హేమలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘ్ మాసం శుక్ల పక్షం తిధి : షష్ఠి మ12.38 తదుపరి సప్తమి నక్షత్రం : రేవతి తె4.52 యోగం :శివంఉ7.22vతదుపరి సిద్ధం తె5.31 కరణం : గరజి రా12.15 సూర్యరాశి :మకరం చంద్రరాశి : మీనం సూర్యోదయం : 6.39 సూర్యాస్తమయం : 5.44 రాహుకాలం:మ3.00-4.30 యమగండం :ఉ9.00-10.30 వర్జ్యం : సా4.52 - 6.28 దుర్ముహూర్తం: ఉ9.01-9.46 & రా11.09 - 12.00 అమృతకాలం:రా1.28-4.04 శుభమస్తు🙏🏻

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 జనవరి 17 , 2018 బుధవారం (సౌమ్యవాసరే) శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం బహుళ పక్షం తిధి :అమావాస్య ఉ7.09 తదుపరి మాఘ శుద్ధ పాడ్యమి నక్షత్రం :ఉత్తరాషాడ రా9.53 తదుపరి శ్రవణం యోగం : హర్షణం ఉ9.58 తదుపరి వజ్రం కరణం : నాగవ ఉ7.09 తదుపరి కింస్తుఘ్నం రా8.08 సూర్యరాశి : మకరం చంద్రరాశి : మకరం సూర్యోదయం :6.38 సూర్యాస్తమయం : 5.42 రాహుకాలం :మ12.00 -1.30 యమగండం :ఉ7.30 -9.00 వర్జ్యం : రా2.15 - 4.00 దుర్ముహూర్తం : ఉ11.47 - 12.32 అమృతకాలం: మ2.48- 4.34 ముక్కనుమ పండుగ సావిత్రీ గౌరీ వ్రతము శుభమస్తు🙏🏻

MAAGHA PURANAM -- 3 మాఘపురాణం - 3వ అధ్యాయము వింధ్య పర్వతము: దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు. మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందుండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. “ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను. మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము. “ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. గంధర్వ యువకుని వృత్తాంతము: “భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను. “ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి. అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను. ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 జనవరి 20, 2018 శనివారం (స్థిరవాసరే) శ్రీ హేమలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘ్ మాసం శుక్ల పక్షం తిధి :తదియ మ12.00 తదుపరి చవితి నక్షత్రం : శతభిషం తె3.30 యోగం : వ్యతీపాతం ఉ10.15 తదుపరి వరీయాన్ కరణం : గరజి మ12.00 తదుపరి వణిజ రా12.22 సూర్యరాశి : మకరం చంద్రరాశి : కుంభం సూర్యోదయం : 6.39 సూర్యాస్తమయం : 5.44 రాహుకాలం :ఉ9.00 -10.30 యమగండం:మ1.30-3.00 వర్జ్యం : ఉ9.40 - 11.21 దుర్ముహూర్తం :ఉ6.36-8.05 అమృతకాలం : రా7.51 - 9.33 శుభమస్తు🙏🏻

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 జనవరి 20, 2018 శనివారం (స్థిరవాసరే) శ్రీ హేమలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘ్ మాసం శుక్ల పక్షం తిధి :తదియ మ12.00 తదుపరి చవితి నక్షత్రం : శతభిషం తె3.30 యోగం : వ్యతీపాతం ఉ10.15 తదుపరి వరీయాన్ కరణం : గరజి మ12.00 తదుపరి వణిజ రా12.22 సూర్యరాశి : మకరం చంద్రరాశి : కుంభం సూర్యోదయం : 6.39 సూర్యాస్తమయం : 5.44 రాహుకాలం :ఉ9.00 -10.30 యమగండం:మ1.30-3.00 వర్జ్యం : ఉ9.40 - 11.21 దుర్ముహూర్తం :ఉ6.36-8.05 అమృతకాలం : రా7.51 - 9.33 శుభమస్తు🙏🏻

Try my free guided meditations here - www.thewayofmeditation.com.au/free-relaxation-meditation/

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ | ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ || రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ | యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ || ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ | జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ || సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ | చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ || రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ | పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ || సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః | ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ || ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ || పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః | వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ || ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ | సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ || హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ | తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ || హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః | అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ || వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః | ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ || ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః | కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ || నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః | తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ || నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః | జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ || జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః | నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ || నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః | నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ || బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే | భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ || తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే | కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ || తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే | నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ || నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః | పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ || ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః | ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ || వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ | యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ || ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ | కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ || పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ | ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ || అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి | ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ || ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా | ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ || ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ | త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ || రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ | సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ || అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః | నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ || https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/videos/1331914286857966/

MAAGHA PURANAM -- 9 మాఘపురాణం -9వ అధ్యాయము పుష్కరుని వృత్తాంతము ఈవిధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటుల నుడివెను. – “పూజ్యులైన ఓ మహర్షీ! ఈ భూలోకమునకు, యమలోకమునకు దూరమెంత?” చనిపోయిన ణా ముగ్గురు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళి వచ్చినవి?” అని ప్రశ్నించెను. వశిష్ఠుళ వారు దీర్ఘముగా నాలోచించి యిటుల బదులు చెప్పిరి. “మాహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి యున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు. దీనికొక ఉదాహరణ వివరింతును ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తన భటుల కాజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి యా విప్రపుంగవుని ప్రాణములు దీసి యమునివద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. యమ ధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను. యముడు భటుల వంక కోపంగా చూచి – “ఓరీ భటులారా! పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరియొకడు గలడు. వానిని తీసుకురాకుండా యీ ఉత్తముని ఏల తీసుకు వచ్చితిరి?” అని గర్జించుసరికి గడగడ వణికిపోయిరి. యమధర్మరాజు పుష్కరుని వైపు జూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు” అని చెప్పెను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచి పోవుదును” అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పాడుచున్న నరక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షల ననుభవించుచుండుట పుష్కరుడు కనులారాగాంచెను. అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం బోవుటకు హరినామ స్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమతమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను. ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారున్నారు. ఇది నిజము. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్యగరపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను.

A step-by-step guide to get richer, healthier, and happier in 31 days

If you don't yet have a plan for 2018, you might be in trouble.<p>Lucky for you, we've already made a plan for you. Above is our 31-day guide to starting off a healthy, wealthy, happy year. Each day is accompanied by a task, along with a quick explanation, below, of why it's important.<p>Read on to find …

Job Interviews

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 సెప్టెంబర్ 26, 2017 మంగళవారం (భౌమ్యవాసరే) శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం తిధి : షష్ఠి మ3.00 తదుపరి సప్తమి నక్షత్రం : అనూరాధ ఉ6.47 తదుపరి జ్యేష్ఠ యోగం : ప్రీతి ఉ9.37 తదుపరి ఆయుష్మాన్ కరణం :తైతుల మ3.00 తదుపరి గరజి తె4.00 సూర్యరాశి : కన్య చంద్రరాశి : వృశ్చికం సూర్యోదయం : 5.52 సూర్యాస్తమయం : 5.53 రాహుకాలం : మ3.00 - 4.30 యమగండం : ఉ9.00 - 10.30 వర్జ్యం : ఉ12.58 - 2.44 దుర్ముహూర్తం : ఉ8.16 - 9.04 & రా10.41- 11.29 అమృతకాలం : రా11.35 - 1.21 🙏🏻

కనకధారాస్తోత్రం వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ | అమందానందసందోహం బంధురం సింధురాననం || అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ | అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || ౧ || ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని | మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || ౨ || ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమ్- ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ | ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || ౩ || బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి | కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః || ౪ || కాలాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ | మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || ౫ || ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన | మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః || ౬ || విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోఽపి | ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః || ౭ || ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే | దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || ౮ || దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా- మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే | దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణప్రణయినీనయనాంబువాహః || ౯ || గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి | సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || ౧౦ || శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై | శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై || ౧౧ || నమోఽస్తు నాళీకనిభాననాయై నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై | నమోఽస్తు సోమామృతసోదరాయై నమోఽస్తు నారాయణవల్లభాయై || ౧౨ || నమోఽస్తు హేమాంబుజపీఠికాయై నమోఽస్తు భూమండలనాయికాయై | నమోఽస్తు దేవాదిదయాపరాయై నమోఽస్తు శార్ఙ్గాయుధవల్లభాయై || ౧౩ || నమోఽస్తు దేవ్యై భృగునందనాయై నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై | నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోఽస్తు దామోదరవల్లభాయై || ౧౪ || నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై | నమోఽస్తు దేవాదిభిరర్చితాయై నమోఽస్తు నందాత్మజవల్లభాయై || ౧౫ || సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి | త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || ౧౬ || యత్కటాక్షసముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః | సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే || ౧౭ || సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే | భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || ౧౮ || దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ | ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || ౧౯ || కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః | అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || ౨౦ || దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే | దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్ ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || ౨౧ || స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ | గుణాధికా గురుతరభాగ్యభాగినో భవంతి తే భువి బుధభావితాశయాః || ౨౨ ||

Free guided meditations with Chad Foreman here - www.thewayofmeditation.com.au/free-relaxation-meditation/